‘Alias Rukmini’: నితిన్ హీరోయిన్గా బాలీవుడ్ భామ .. ‘అలియాస్ రుక్మిణి’లో కొత్త లుక్
కొత్త లుక్
‘Alias Rukmini’: నేచురల్ స్టార్ నాని ఆధ్వర్యంలోని యూనిమస్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘ధండోరా’ ఫేమ్ మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గుంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్ నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ ద్వారా ఆమె పాత్ర రుక్మిణిని పరిచయం చేశారు. ఇందులో రుక్మిణి ఓ స్ట్రిక్ట్ స్కూల్ టీచర్‌గా కనిపించనుంది. ఆమె కఠినమైన వైఖరి కారణంగా విద్యార్థులు ఆమెకు ‘డెవిల్’, ‘హిట్లర్’, ‘హోంవర్క్ పోలీస్’ అంటూ ముద్దు పేర్లు పెట్టుకున్నారు.
గ్లింప్స్‌లో రుక్మిణి కోపంగా క్లాస్రూమ్ బోర్డుపై తన పేరు రాసుకుంటుంది. ఆ తర్వాత విద్యార్థుల వైపు కఠినంగా చూస్తుంది. ఈ చిన్న పరిచయంతోనే విద్యార్థులను గడగడలాడించే టీచర్‌గా రుక్మిణి పాత్రను చూపించారు.
ఇక నితిన్ పాత్ర కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ఇంతకుముందు చేయని తరహాలో నితిన్ పాత్రను డిజైన్ చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రేమకథతో పాటు ఆసక్తికరమైన ప్రధాన సంఘర్షణ చుట్టూ కథ సాగుతుందని, ప్రేక్షకులకు నితిన్‌ను కొత్తగా చూపించబోతున్నామని చిత్రబృందం పేర్కొంది.
బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాకు మేనకోడలైన ఆఫియా సయ్యద్ ‘అలియాస్ రుక్మిణి’తో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. నితిన్‌తో ఆమె జోడీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.