వయ్యారాల అమైరా దస్తూర్

Bollywood heroine Amyra Dastur has acted in Hindi as well as Tamil and Telugu language films;

Update: 2025-05-31 09:42 GMT
వయ్యారాల అమైరా దస్తూర్
  • whatsapp icon

బాలీవుడ్ హీరోయిన్ అమైరా దస్తూర్.  హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. వయ్యారాల అమైరా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


1993లో జన్మించిన అమైరా విద్యాబ్యాసం ముంబైలో సాగింది. హిందీ, గుజరాతి భాషాల్లో దిట్ట అయిన దస్తూర్ కామర్స్ లో డిగ్రీ చేసింది.


అమైరా మోడల్ గా కెరీర్ ప్రారంభించి 2013లో హిందీ సినిమా ఇసాక్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

 


ధనుష్ హీరోగా నటించిన 'అనేగన్(2015)' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి...సుదీర్ఘమైన విరామం తర్వాత 2023లో భగీర సినిమాలో నటించింది.

 


అమైరా చేసినవి కొన్ని సినిమాలే అయినా, అమ్మడి అందాల ఆరబోతకు భలే క్రేజ్ ఉంది. 


ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే అందాల విందుకు ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.


అమైరా మొదటి అంతర్జాతీయ ప్రాజెక్టు కుంగ్ ఫూ యోగా సినిమాలో జాకీ చాన్‌తో జత కట్టింది. భారతదేశంలో 2017లో విడుదలైన ఈ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది.

 


అమైరా దస్తూర్ 2018లో విడుదలైన మనసుకు నచ్చింది సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత రాజుగాడు సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటించింది.


2021లో అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన తాండవ్ సీరీస్ లో అమైరా తన నటనతో మెప్పించింది.

 



 అయితే దశాబ్ద కాలం దాటినా ఈ అందాల భామకు సరైన హిట్టు దొరకలేదు. హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.


దక్షిణాదితో పోలిస్తే బాలీవుడ్ లో కొంత బిజీగానే ఉన్న అమైరా...తనకంటూ ఓ ఇమేజీ మాత్రం సృష్టించుకోలేకపోయింది.



 courtesy:instagram




 



 


 




 


Tags:    

Similar News