Censor Shock for OG: ఓజీకి సెన్సార్ షాక్..పెద్దలకు మాత్రమే..
పెద్దలకు మాత్రమే..
Censor Shock for OG: పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమా సెప్టెంబర్ 22, 2025న సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి 'A' సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాకు 'A' సర్టిఫికేట్ రావడానికి ప్రధాన కారణం అందులో ఉన్న ఎక్కువ హింసాత్మక సన్నివేశాలు అని తెలుస్తోంది. అలాగే, సెన్సార్ బోర్డు కొన్ని బూతు పదాలను మ్యూట్ చేయాలని, మరికొన్ని హింసాత్మక సన్నివేశాల క్లోజప్ షాట్‌లను తగ్గించాలని సూచించింది.రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాల 15 సెకన్లు
సాధారణంగా పవన్ కల్యాణ్ సినిమాలకు 'U/A' సర్టిఫికేట్ వస్తుంటుంది. పంజా తర్వాత ఆయన సినిమాకుA సర్టిఫికేట్ రావడం ఇదే రెండోసారి. ఈ సెన్సార్ రిపోర్ట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
మరో వైపు నిన్న విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్ లో దుమ్ములేపుతోంది. తెలుగు ట్రైలర్ కు 19 గంటల్లో 8.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. పవన్ యాక్షన్ తో పాటు ఇమ్రాన్ హష్మీ సీన్స్ అదిరిపోయాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.