Chiranjeevi: మెగా 158 టైటిల్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి!
చిరంజీవి!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తుండటం విశేషం. ఈ అలవాటు కారణంగానే ఆయనను అభిమానులు సరదాగా చిరులీక్స్ అని పిలుస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘కొరియన్ కనకరాజు’ విజయత్సవ వేడుకలో చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ అయిన 'మెగా 158' గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైటిల్‌ను స్టేజ్‌పైనే చెప్పేందుకు చిరంజీవి సిద్ధపడ్డారు. అయితే అదే సమయంలో ఈ ప్రాజెక్ట్‌కి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ వెంటనే అడ్డుకుని, టైటిల్‌ను ఇప్పుడే బయటపెట్టవద్దని చిరంజీవిని కోరారు.
చిరంజీవి మాట్లాడుతూ.. తన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అద్భుతమైన బాణీలు అందిస్తున్నారని ప్రశంసించారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
చిరంజీవి స్టేజ్‌పై అసలు టైటిల్ గురించి ఎలాంటి హింట్ ఇవ్వనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ‘కదిరి’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. చిరంజీవి చేసిన ఒక అనధికారిక వ్యాఖ్య కారణంగానే ఫ్యాన్స్ మధ్య ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. ఆగస్టు 22న మేకర్స్ అఫీషియల్‌గా టైటిల్ గ్లింప్స్ విడుదల చేసే వరకు 'కదిరి' టైటిల్ కేవలం ఊహాగానంగానే మిగిలిపోనుంది.