Big Update from Kamal Haasan: 46 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్.. కమల్ బిగ్ అప్ డేట్
కమల్ బిగ్ అప్ డేట్
Big Update from Kamal Haasan: సైమా అవార్డ్స్ 2025లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారాయి. ఈ వేడుకలో ఆయన రాజనీకాంత్‌తో కలిసి చేయబోయే కొత్త సినిమా గురించి స్పష్టత ఇచ్చారు. మేమిద్దరం ఎంతో కాలంగా కలిసి సినిమాలు చేయలేదు. ఎప్పటినుంచో మేమిద్దరం కలిసి సినిమాలు చేయాలనుకున్నాం. చివరికి అది ఇప్పుడు జరుగుతోంది. ఈ కలయిక ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ మా ఇద్దరికీ ఇది ఏమాత్రం ఆశ్చర్యకరమైన విషయం కాదు.
కమల్ హాసన్, రజినీకాంత్ మధ్య పోటీ గురించి మీడియా అభిమానులు సృష్టించారని ఆయన అన్నారు. "మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి పోటీ లేదు. అభిమానులే ఆ పోటీని సృష్టించారు. ఒకే చిత్రంలో మా ఇద్దరికీ నటించే అవకాశం లభించడం చాలా గొప్ప విషయం" అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో, రాజనీకాంత్, కమల్ హాసన్ కలిసి లొకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారని సమాచారం.
అపూర్వ రాగంగళ్ (1975) సినిమా ద్వారా రజనీకాంత్ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. కమల్ హాసన్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఇది వారిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం. మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ వంటి సినిమాల్లో రజినీ కాంత్, కమల్ హాసన్ నటించిన చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి.1979లో వచ్చిన అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్ సినిమా తర్వాత దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఇద్దరూ కలిసి నటించలేదు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటించబోతున్న సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.