Deepika Padukone: తొలి భారతీయురాలిగా దీపికా రికార్డ్...
దీపికా రికార్డ్...
Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ఇపుడు మెటా సంస్థతో కలిసి చేసిన కొత్త ప్రయోగంతో వార్తల్లో నిలిచింది. ఆమె ఇపుడు మెటా ఏఐకి కొత్త వాయిస్ గా నిలవనుంది. ఈవిషయాన్ని తెలుపుతూ దీపికా పదుకొణే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. ఒక రికార్డింగ్ స్టూడియోలో Meta AI కోసం తన వాయిస్‌ను రికార్డ్ చేస్తూ కనిపించారు. హాయ్ నేను దీపికా పదుకొణే నేను ఇపుడు మెటా ఏఐకి కొత్త వాయిస్ ఇస్తున్నాను. రింగ్ పై ట్యాప్ చేయండి,నా వాయిస్ వినిపిస్తుంది. ఇది నిజంగా చాలా కూల్ గా ఉంది అనిపిస్తోంది. మీరు నా వాయిస్‌తో ఇంగ్లీష్‌లో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతటా చాట్ చేయవచ్చు. దీన్ని మీరు ప్రయత్నించండి, మీ అభిప్రాయం నాకు తెలియజేయండి!" అని రాశారు.ఈ వీడియో ద్వారా ఆమె Meta AIకి వాయిస్ అందించిన మొదటి భారతీయ సెలబ్రిటీగా మారిన విషయాన్ని తన అభిమానులకు తెలిపారు.