Dhanush–Mrunal Wedding: వాలెంటైన్స్ డే నాడు ధనుష్-మృణాల్ పెళ్లి?
ధనుష్-మృణాల్ పెళ్లి?
Dhanush–Mrunal Wedding: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ ఫిబ్రవరి 14న, అంటే వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు) నాడు వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా, గోప్యంగా జరగనుందని వార్తలు వస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా ధనుష్, మృణాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ పలుమార్లు పుకార్లు వినిపించాయి. ముఖ్యంగా మృణాల్ నటించిన కొన్ని సినిమాల ఈవెంట్లకు ధనుష్ హాజరుకావడం, అలాగే సోషల్ మీడియాలో ధనుష్ సోదరీమణులను మృణాల్ ఫాలో అవుతుండటం వంటి పరిణామాలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. దీనికి తోడు, వీరిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా ఇది నిజమేనని భావిస్తున్నారు.
అయితే, ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు ధనుష్ కానీ, మృణాల్ ఠాకూర్ కానీ అధికారికంగా స్పందించలేదు. గతంలో ఒకసారి మృణాల్ ఈ డేటింగ్ రూమర్లను ఖండిస్తూ.. తామిద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని, ఆ వార్తలు చూసి తనకు నవ్వొచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ, తాజాగా వాలెంటైన్స్ డే పెళ్లి వార్త మళ్లీ తెరపైకి రావడంతో అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.