Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన నటనతో పాటు ఫ్యాషన్‌కి కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తనలో ఉన్న ఓ విచిత్రమైన టాలెంట్ గురించి తాజాగా ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ టాలెంట్ తనకు దాదాపు ఎలాంటి ఉపయోగం లేదని కూడా జాన్వీ చెప్పడం విశేషం. ప్యారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ది కట్ తో జరిగిన ఓ సంభాషణలో జాన్వీ పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెకు ఏమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా అని ప్రశ్నించగా.. ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాను తన నాలుకను దాదాపు 360 డిగ్రీల వరకు తిప్పగలనని జాన్వీ వెల్లడించింది. ఈ టాలెంట్ గురించి చెబుతూ.. ఇదొక చాలా వింతైన, పనికిరాని స్కిల్ అని ఆమె స్వయంగా పేర్కొంది. అయితే ఈ విచిత్రమైన టాలెంట్‌ను జాన్వీ ఎలా గుర్తించిందో కూడా వివరించింది. స్కూల్‌లో చదువుకునే రోజుల్లో కొంతమంది క్లాస్‌మేట్స్ తమ నాలుకతో ముక్కును తాకించగలరా లేదా అని పోటీ పడేవారట. జాన్వీ మాత్రం అలా ముక్కును నాలుకతో తాకించలేకపోయేదట.

అయితే తన తోటి పిల్లలను ఇంప్రెస్ చేయాలని జాన్వీ అనుకుంది. దాంతో తన నాలుకతో మరో రకమైన ట్రిక్ చేయడానికి ప్రయత్నించింది. చివరికి తన నాలుకను ప్రత్యేకంగా తిప్పగలిగే టాలెంట్‌ను గుర్తించింది. అప్పటి నుంచి అదే తనకు ఓ విచిత్రమైన పార్టీ ట్రిక్గా మారిపోయిందని జాన్వీ చెప్పింది.

Tags: