‘Fauzi’: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ఫౌజీ’ నుంచి కీలక అప్ డేట్
కీలక అప్ డేట్
‘Fauzi’: ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫౌజీ’ సినిమాకు మరోసారి రిలీజ్ వాయిదా పడింది. డిసెంబర్ 3న సినిమాను విడుదల చేయాలని గతంలో ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఆ తేదీ కూడా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ను మాత్రం వెంటనే ప్రకటించే ఆలోచనలో మేకర్స్ లేరని సమాచారం. సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
సినిమాలో ఇంకా చాలా భాగం షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ మరో 60 రోజులకు పైగా షూటింగ్‌కు సమయం కేటాయించాల్సి ఉందని చిత్ర యూనిట్‌కు సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాకు కూడా సమయం కేటాయించాల్సి ఉంది. దీంతో ‘ఫౌజీ’ షూటింగ్ పూర్తి కావడానికి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.
అందుకే ప్రస్తుతం సినిమా ఎప్పుడు పూర్తవుతుందనే విషయంలో నిర్మాతలకు కూడా స్పష్టత లేదని తెలుస్తోంది. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియకపోవడంతో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించడానికి మేకర్స్ ఆసక్తి చూపడం లేదని సమాచారం. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ నుంచి ఏదైనా కొత్త పోస్టర్ లేదా ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆ రోజు కొత్త రిలీజ్ డేట్‌ను మాత్రం ప్రకటించే అవకాశం లేదని చిత్ర వర్గాల సమాచారం. ఇక ‘ఫౌజీ’ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.