సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు
Akhil's father, film hero Akkineni Nagarjuna, and mother, Akkineni Amala, met Chief Minister Revanth Reddy.;
By : Politent News Web3
Update: 2025-05-31 06:46 GMT
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ పెళ్లి సందడి మొదలైంది. అఖిల్ తండ్రి సినీ హీరో అక్కినేని నాగార్జున, తల్లి అక్కినేని అమల.. పెళ్లి కుమార్తె జైనాబ్ తల్లిదండ్రులు ఈ రోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుక ఆహ్వానాన్ని ఈ సందర్భంగా సినీనటుడు నాగార్జున దంపతులు అందించారు.
జూన్ 6 న అఖిల్ -జైనాబ్ ల పెళ్లి జరుగుతున్నట్లు సమాచారం. అఫిషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు కాని పెళ్లి పనులు చురుకుగా సాగుతున్నాయి. నాగ చైతన్య వివాహం లాగానే అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే జరగనుంది. అఖిల్ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో పనులు జోరుగా జరుగుతున్నట్టు సమాచారం.