Trending News

Hero Found for Ellamma: ఎల్లమ్మకు దొరికిన హీరో.. తెరపైకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

తెరపైకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

Update: 2025-10-17 06:06 GMT

Hero Found for Ellamma: బలగం వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి, తన తదుపరి ప్రాజెక్ట్‌పై సినీ పరిశ్రమలో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఎల్లమ్మ సినిమా హీరో ఎవరనేది ఇంకా తేలకపోవడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బలగం తర్వాత వేణు, తన గురువు దిల్ రాజు బ్యానర్‌లోనే ఎల్లమ్మ ప్రాజెక్ట్‌ను ప్రకటించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ ప్రాజెక్ట్ హీరో ఎవరనేది ఇంకా ఖరారు కాకపోవడంతో సినిమా ఎప్పుడు మొదలవుతుందనే దానిపై సందిగ్ధత ఉంది.

మొదట హీరో నానిని సంప్రదించారు, కానీ ఇతర కమిట్‌మెంట్ల వల్ల ఆయన తప్పుకున్నారు.

ఆ తర్వాత హీరో నితిన్‌ పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి, కానీ బడ్జెట్ సమస్యలు, ఇతర కారణాల వల్ల ఆయన కూడా వైదొలిగినట్లు ప్రచారం జరిగింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు మధ్యలో వినిపించినా, అది కేవలం ఊహాగానంగానే మిగిలిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో డీఎస్పీ హీరోగా నటించనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డీఎస్పీని హీరోగా చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ వార్త ప్రాజెక్ట్‌పై అంచనాలను భారీగా పెంచింది.

Tags:    

Similar News