Mallika Sherawat: బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్‌కు తనపై క్రష్ ఉందని, ఆయన తనకు పర్సనల్‌గా సోషల్ మీడియాలో మెసేజ్‌లు కూడా చేస్తుంటారని ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో త్వరలో ప్రారంభం కానున్న ది ట్రెయిటర్స్ సీజన్-2 రియాలిటీ షో ప్రమోషన్లలో భాగంగా ఆమె ఈ విషయాలను వెల్లడించారు.

షోలో ఆదిత్య ప్రశ్నకు మల్లికా సమాధానం

ది ట్రెయిటర్స్ 2 షో ప్రోమో సంభాషణలో తోటి కంటెస్టెంట్, కంటెంట్ క్రియేటర్ ఆదిత్య కులశ్రేష్ఠ.. "మీకు ఎవరిపైనైనా క్రష్ ఉందా? లేక మీపైనే అందరికీ క్రష్ ఉంటుందా?" అని మల్లికాను సరదాగా ప్రశ్నించారు. దీనికి మల్లికా స్పందిస్తూ.. "నాపైనే అందరికీ క్రష్ ఉంటుంది. ఇటీవల హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌కు కూడా నాపై క్రష్ ఏర్పడింది. నేను అబద్ధం చెప్పడం లేదు, టామ్ నాకు పర్సనల్‌గా మెసేజ్‌లు చేశారు. నా దగ్గర ఇప్పుడు ఫోన్ ఉండి ఉంటే.. మేమిద్దరం కలిసి కలసి ఎంజాయ్ చేసిన పార్టీ వీడియోలను మీకు చూపించేదాన్ని. టామ్ క్రూజ్ చాలా అద్భుతమైన వ్యక్తి" అని వ్యాఖ్యానించారు.

కాగా, ఈ వ్యవహారంలో కేవలం మల్లికా శెరావత్ మాత్రమే మాట్లాడారని, దీనిపై టామ్ క్రూజ్ టీమ్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదా ధ్రువీకరణ రాలేదని సమాచారం.

ఆగస్టు 13 నుండి ది ట్రెయిటర్స్ 2 ప్రసారం

కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మైండ్ గేమ్‌లు, వ్యూహాలతో కూడిన ప్రసిద్ధ రియాలిటీ షో ది ట్రెయిటర్స్ మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు రెండవ సీజన్ ఆగస్టు 13 నుండి ప్రైమ్ వీడియో లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. కంటెస్టెంట్లను రహస్యంగా ఫెయిత్‌ఫుల్స్, ట్రెయిటర్స్ గా వర్గీకరించి, మైండ్ గేమ్‌లు, ఎలిమినేషన్లతో విన్నర్‌ను ప్రకటిస్తారు. ఈ సీజన్‌లో మల్లికా శెరావత్‌తో పాటు మునవర్ ఫరూఖీ, శ్వేతా తివారీ, రియా చక్రవర్తి, క్రిస్టల్ డిసౌజా, దలీప్ తాహిల్, అభిషేక్ మల్హాన్ వంటి ప్రముఖులు పాల్గొంటున్నారు. షో ప్రారంభం కాకముందే మల్లికా శెరావత్ చేసిన ఈ వ్యాఖ్యలతో ది ట్రెయిటర్స్ 2 పై ప్రేక్షకులలో విపరీతమైన హైప్ నెలకొంది.

Tags: