R. Madhavan: సోషల్‌ మీడియా వేదికగా తనపై వచ్చే ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారుడు అనే విమర్శలపై ప్రముఖ నటుడు ఆర్‌.మాధవన్‌ కీలక విషయాలు చెప్పారు. నెటిజన్లు చేసే వ్యాఖ్యలు తన ఆలోచనలను లేదా నిర్ణయాలను ఏమాత్రం ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తాను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని మాధవన్‌ తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా.. వారు దేశం లేదా రాష్ట్రం కోసం మంచి పనులు చేసినప్పుడు మద్దతుగా నిలవడం ఒక బాధ్యతాయుత పౌరుడిగా తన కనీస ధర్మమని పేర్కొన్నారు.

దేశ గొప్పతనాన్ని చాటడమే లక్ష్యం

భారత విజయాలను, మన దేశ గొప్పతనాన్ని వెండితెర ద్వారా ప్రపంచానికి చాటిచెప్పడంలో ఎలాంటి తప్పు లేదని, దాన్ని ప్రచారం అని ముద్ర వేయడం సరికాదని మాధవన్ అభిప్రాయపడ్డారు. ధురంధర్‌ చిత్రాన్ని ఒక ప్రచార చిత్రంగా చూడటాన్ని ఆయన తప్పుపట్టారు. పాకిస్థాన్ నేపథ్యంలో సాగే భారత జాతీయ భద్రతకు సంబంధించిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిందని, విమర్శలకు భయపడి నిజాలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Tags: