Nargis Fakhri: "నేను పూర్వజన్మలో పైలట్నేమో".. విమానం నడిపిన అనుభవాన్ని పంచుకున్న నటి నర్గీస్ ఫక్రీ..
నటి నర్గీస్ ఫక్రీ..
Nargis Fakhri: రాక్‌స్టార్ చిత్రంతో భారతీయ ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ తనలో ఉన్న మరో కొత్త ప్రతిభను అభిమానులతో పంచుకున్నారు. తొలిసారిగా విమానం నడిపిన ఆనందకర అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా వివరిస్తూ.. తన పూర్వజన్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న నర్గీస్, తన స్నేహితులు ఏక్తా కపూర్, ఊర్వశీ ధోలాకియాలతో కలిసి సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే విమానం నడిపే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది.
"చాలా సులువుగా నడిపేశాను": నర్గీస్ ఫక్రీ
పైలట్ సీటులో కూర్చుని విమానం యోక్ పట్టుకున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ నర్గీస్ సంతోషం వ్యక్తం చేశారు. "మొదటిసారి విమానం నడిపినప్పటికీ ఎంతో సులభంగా నడపగలిగాను. బహుశా నేను గత జన్మలో పైలట్‌గా పనిచేసి ఉంటానేమో" అని సరదాగా చమత్కరించారు. దీనికి సంబంధించిన పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
నర్గీస్ కెరీర్ - తాజా చిత్రాలు
2011లో రణ్‌బీర్ కపూర్ సరసన రాక్‌స్టార్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నర్గీస్ ఫక్రీ, ఆ తర్వాత పొలిటికల్ థ్రిల్లర్ మద్రాస్ కేఫ్ లో నటనకు గాను మంచి ప్రశంసలు అందుకున్నారు. అలాగే మై తేరా హీరో, హౌస్‌ఫుల్ 3 వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలతో పాటు హాలీవుడ్ మూవీ 'స్పై'లోనూ నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఆమె రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించారు. తరుణ్ మన్సుఖానీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణంతో వచ్చిన హౌస్‌ఫుల్ 5మర్డర్ మిస్టరీ కామెడీ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మస్తీ4 లో రితేశ్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్, అఫ్తాబ్. శివదాసానిలతో కలిసి ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లోనూ ఆమె నటించారు.