Keerthi Suresh as Ellamma: ఎల్లమ్మగా కీర్తి సురేష్?

కీర్తి సురేష్?

Update: 2025-10-18 05:09 GMT

Keerthi Suresh as Ellamma: టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కానున్నట్టుగా ప్రచారం జరుగుతున్న 'ఎల్లమ్మ' సినిమా గురించి టాలీవుడ్‌లో సరికొత్త చర్చ మొదలైంది. ఈ సినిమాలో కథానాయికగా జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించనుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్న DSP, ఎట్టకేలకు ఈ సినిమాతో నటుడిగా పరిచయం కాబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ సినిమా 'బలగం' ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించనున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను తన బ్యానర్‌పై నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సరసన కథానాయికగా కీర్తి సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కీర్తి సురేష్ ఇప్పటికే దిల్ రాజు బ్యానర్‌లోనే విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమాకు కూడా కమిట్ అయ్యారని తెలుస్తోంది. దీంతో 'ఎల్లమ్మ'లో కూడా ఆమె నటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.'ఎల్లమ్మ' సినిమా కథ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో బలమైన మహిళా పాత్రతో కూడిన కథాంశంతో ఉంటుందని సమాచారం. దర్శకుడు వేణు ఎల్దండి 'బలగం' తర్వాత ఈ కథను చాలా కాలంగా సిద్ధం చేసుకుని ఉన్నారు. 'ఎల్లమ్మ' ప్రాజెక్ట్ చాలా కాలంగా హీరో ఎంపిక విషయంలో సందిగ్ధతను ఎదుర్కొంటోంది. తొలుత ఈ కథను నేచురల్ స్టార్ నానికి వినిపించినప్పటికీ, ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత నితిన్, శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి పలువురు యువ హీరోల పేర్లు చర్చకు వచ్చాయి. చివరకు, ఊహించని విధంగా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫిక్స్ అయినట్టు ప్రస్తుతం ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి కానీ, DSP లేదా కీర్తి సురేష్ నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. DSP నటన, కీర్తి సురేష్ కాంబినేషన్ నిజమైతే, ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో మరింత ఆసక్తిని పెంచే అవకాశం ఉంది.

Tags:    

Similar News