Kiran Abbavaram Reveals Son’s Face: కిరణ్ అబ్బవరం కొడుకు ఫేస్ రివీల్..ఏం పేరు పెట్టారంటే.?
ఏం పేరు పెట్టారంటే.?;
Kiran Abbavaram Reveals Son’s Face: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ దంపతులు ఇటీవలే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట తమ కొడుకు నామకరణ మహోత్సవాన్ని తిరుమలలో కుటుంబ సభ్యులు మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. తన కుమారుడికి హను అబ్బవరం అని పేరు పెట్టినట్లు తెలిపారు..తొలిసారి కొడుకు ఫోటోలను పంచుకున్న కిరణ్ అబ్బవరం . కుమారుడికి హను అని పేరు పెట్టినట్లు చెప్పారు. తన కొడుకుకు తిరుమలలో నామకరం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇది నాకు ఒక జీవిత కాలం గుర్తుండే క్షణం. శ్రీవారి దీవెనలతో మా కుటుంబం ఆనందంగా ఉంది అన్నారు.
2024లో తన మొదటి సినిమా రాజావారు రాణిగారు లో నటించిన రహస్య గోరక్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2025, మే 22న ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్, ఆ తర్వాత ఎస్.ఆర్.కల్యాణమండపం (2021) సినిమాతో కమర్షియల్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు ఆయన కథ, స్క్రీన్‌ప్లే,డైలాగ్స్ కూడా అందించారు.
ప్రస్తుతం K-Ramp, చెన్నై లవ్ స్టోరీ వంటి సినిమాల్లో నటిస్తున్న కిరణ్ అబ్బవరం, ఈ నెలలో మరో కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. గతంలో వచ్చిన ‘క’ మూవీకి సీక్వెల్‌గా ఈ K-Ramp రూపొందుతోంది.