Varun Tej: కొరియన్ కనకరాజ్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్
Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్‌పై యూనిట్ అపారమైన నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలో సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో విడుదల తేదీకి ఒక్క రోజు ముందుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నట్లు హీరో వరుణ్ తేజ్ ప్రకటించారు. భీమవరంలో ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ విశేషాలను పంచుకున్నారు.
ఈ చిత్రంతో థియేటర్లలో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతోందని వరుణ్ తేజ్ తెలిపారు. దర్శకుడు మేర్లపాక గాంధీ తనను చాలా కొత్తగా చూపించారని, ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో పెద్ద హిట్‌గా నిలుస్తుందని కొనియాడారు. కమెడియన్ సత్యతో తన కాంబినేషన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, తమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని ప్రశంసించారు. ఇక ఈ చిత్రంలో తాను పోషించిన 'చైత్ర' పాత్ర తన కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోతుందని హీరోయిన్ రితిక నాయక్ పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాలో తాను ఒక చక్కటి పాట పాడినట్లు నల్గొండ గద్దర్ సంతోషం వ్యక్తం చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ, సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, కుటుంబ సమేతంగా థియేటర్లలో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. అభిమానులు గర్వపడేలా ఉండే ఈ సినిమా ప్రేక్షకులకు ఒక చక్కని అనుభూతిని పంచుతుందని యూనిట్ సభ్యులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 7న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి!