Varun Tej: రాయలసీమ యాసలో కొరియన్ స్టైల్..కడుపుబ్బా నవ్విస్తాం: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్
Varun Tej: సినిమా చూసేటప్పుడు ఒక సాధారణ ప్రేక్షకుడిగా ఆలోచిస్తానని, థియేటర్‌లో అందరూ కడుపుబ్బా నవ్వుకోవాలనే ఈ సినిమా చేశానని అంటున్నారు హీరో వరుణ్ తేజ్ . ఆయన నటించిన కొరియన్ కనకరాజు' విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. పొడవుగా ఉండే హీరోలు కామెడీ చేయకూడదనే అపోహ కరెక్ట్ కాదని, సరైన పాత్ర పడితే ఎవరైనా నవ్విచగలరని నిరూపించడానికే ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పారు.
ఈ చిత్రంలో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఏకంగా రెండు భిన్నమైన బాడీ లాంగ్వేజ్‌లు, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న రోల్‌లో నటించడం నటుడిగా తనకు ఎంతో తృప్తినిచ్చిందని తెలిపారు. ఈ మూవీ కోసం ఏకంగా రాయలసీమ యాసతో పాటు కొరియన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారట! అంతేకాదు, సినిమాలో తన లుక్ కోసం ఫస్ట్ టైమ్ హెయిర్‌కు కలర్ వేసి మరీ కొరియన్ స్టైల్ మేకోవర్ ట్రై చేసినట్లు వెల్లడించారు. కొరియాలో షూటింగ్‌కి వెళ్లినప్పుడు చాలామంది కుర్రాళ్ళు ఇదే హెయిర్‌స్టైల్‌లో కనిపించడంతో తనకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందట.
ఇక సినిమాలో కమెడియన్ సత్యతో కలిసి చేసిన కామెడీ ట్రాక్ థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడం ఖాయమని, రితిక నాయక్ కూడా తన పాత్రలో అచ్చం కొరియన్ అమ్మాయిలాగే జీవించిందని ప్రశంసించారు. తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మరో మేజర్ హైలైట్ అని, థియేటర్లలో అదిరిపోయే సౌండ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పారు.
నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా చూడాలి