Our Shankara Varaprasad Garu: మన శంకర వరప్రసాద్ గారూ నుంచి లేటెస్ట్ అప్ డేట్

లేటెస్ట్ అప్ డేట్

Update: 2025-09-06 07:03 GMT

Our Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న 'మన శంకర వరప్రసాద్ గారు'. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 19 వరకు కొనసాగనుంది. ఈ షెడ్యూల్‌లో రెండు భారీ పాటలను చిత్రీకరించడానికి చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పాటలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన గత షెడ్యూల్ చిత్రీకరణ కేరళలో జరిగింది.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ నెలలో వెంకటేష్ షూటింగ్‌లో పాల్గొననున్నారు.ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కొత్త షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి కానుందని తెలుస్తోంది. సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News