Little Hearts Romantic comedy Film: ప్లీజ్ ఫోన్ స్విఛ్ ఆఫ్ చేయొద్దు బ్రదర్
ఫోన్ స్విఛ్ ఆఫ్ చేయొద్దు బ్రదర్
Little Hearts Romantic comedy Film: లిటిల్ హార్ట్స్ రొమాంటిక్ కామెడీ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ కలెక్షన్లలోనూ సత్తా చాటింది. ఇప్పటి వరకు దాదాపు 30 కోట్ల వరకు కలెక్ట్ చేసిందిన ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాపై అల్లు అర్జున్, రవితేజ, అక్కినేని నాగ చైతన్య, నాని వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను అభినందించారు.
లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. మహేశ్ ఏమన్నారంటే..సినిమా నచ్చి ఫుల్గా ఎంజాయ్ చేశా.. బాగుందని ట్వీట్ చేశాడు. అలాగే మహేష్ బాబు తన పోస్ట్‌లో చిత్ర నటీనటుల నటనను, యువ నటీనటుల నటనను కొనియాడారు.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమిల్లిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. "నువ్వు దయచేసి ఫోన్ ఆపేసి ఎక్కడికి వెళ్లొద్దు బ్రదర్.. ఇక నుంచి నువ్వు చాలా బిజీ అయిపోతావ్.. కుమ్మేసెయ్ అంటూ సరదాగా ట్వీట్ చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, మహేష్ బాబు తన సినిమాపై ట్వీట్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోతానని సింజిత్ చెప్పిన నేపథ్యంలో మహేష్ బాబు ఇలా స్పందించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.