Mahakali Movie: మహాగా భూమిశెట్టి.. క్రేజీ అప్డేట్

క్రేజీ అప్డేట్

Update: 2025-10-30 10:28 GMT

Mahakali Movie: హనుమాన్ సినిమాతో జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రశంశలు అందు కున్న ప్రశాంత్ వర్మ రూపొందించిన సినిమా మహాకాళి. ఓ పక్క జైహనుమాన్ చేస్తూనే తన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' బ్యా నర్ పై ఈ సినిమా మొదలు పెట్టారు. అయితే దీనిని తన దర్శకత్వంలో తీయడం లేదు. పూజ కొల్లూరు దర్శకత్వంలో భద్రకాళి తెరకెక్కిస్తున్నా రు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో ఒక అమ్మాయి తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించడం, అలాగే ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో కాలిపోవడం, బెంగాలీ ఫాంట్లో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ మధ్యలో డైమండ్ లాంటి ఆకారాన్ని చూపించడం సినిమాపై ఆసక్తి పెంచాయి. ఇవాళ 'మహా కాళీ' నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. ఈ ప్రెస్టీజి యస్ ప్రాజెక్ట్ లో కన్నడ నటి, బిగ్ బాస్ బ్యూటీ భూమిశెట్టిని 'మహాగా' పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా "సృష్టి యొక్క విశ్వ గర్భం నుండి విశ్వంలోని అత్యంత క్రూరమైన సూపర్ హీరో మేల్కొంటా డు” అని ప్రశాంత్ వర్మ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మైథికల్ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటుడు, ఛావా విలన్ అక్షయ్ ఖన్నా 'అసుర గురు శుక్రాచార్య' పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News