Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుండి వెల్లువెత్తిన శుభాకాంక్షలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరిత పోస్ట్‌ను పంచుకున్నారు. ప్రతీ ఒక్కరూ చూపించిన అనంతమైన ప్రేమకు తన మనసు నిండిపోయిందని, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అభిమానులకు మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు

తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన మహేష్.. "మీరు నాపై చూపించే అభిమానమే నా అసలైన బలం. మీ ప్రేమ నన్ను ఎంతో అదృష్టవంతుడిని చేసింది. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేయడానికి రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రంగా కష్టపడి పనిచేస్తాను" అని అభయమిచ్చారు.

వారణాసిపై క్రేజీ అప్‌డేట్స్ - పోస్టర్లు

తన రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి కూడా మహేష్ స్పందించారు. ఈ సినిమా తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైనదని, ఈ అద్భుతాన్ని వెండితెరపై వీక్షించే క్షణం కోసం తాను కూడా ప్రేక్షకుల లాగే ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఇక మహేష్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుండి మేకర్స్ రెండు గూస్‌బంప్స్ తెప్పించే పోస్టర్లను విడుదల చేశారు.

రుద్ర అవతారంలో మహేష్:

రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో మహేష్ లుక్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది.

అడ్వెంచరస్ పోస్టర్లు:

ఒక పోస్టర్‌లో అడవి గుండా వెదురు తెప్పపై పయనిస్తూ కనిపించగా.. మరొక పోస్టర్‌లో ఆఫ్రికాలోని ప్రసిద్ధ మసాయ్ మారా అడవుల్లో జిరాఫీలు, క్రూరమృగాల నడుమ ఒక అడ్వెంచరర్ లుక్‌లో మెరిసిపోయారు.

వరల్డ్ వైడ్ ఐమ్యాక్స్ రిలీజ్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్‌తో గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ విజువల్ వండర్, వచ్చే ఏడాది (2027) ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో భారీ ఎత్తున విడుదల కానుంది.

Tags: