New Poster from G2: G2 నుంచి కొత్త పోస్టర్.. విలన్ గా ఇమ్రాన్ హష్మీ
విలన్ గా ఇమ్రాన్ హష్మీ;
New Poster from G2: అడవి శేష్ నటించిన G2 సినిమా గూఢచారికి సీక్వెల్. ఈ సినిమాని మే 1, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అడవి శేష్ మరో మిషన్ కు రెడీ అయినట్టు విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది G2 కథ గూఢచారి కథకు కొనసాగింపు. ఇది ఇండియాలో కాకుండా గ్లోబల్ స్థాయిలో జరిగే స్పై థ్రిల్లర్‌గా రూపొందుతుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా పరిచయం అవుతున్నారు. వామికా గబ్బి 'ఏజెంట్ 116'గా కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి భాగంలో ఉన్న మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని వంటి నటులు కూడా ఈ సినిమాలో కొనసాగుతారు.
G2 సినిమాతో వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.G2 అనేది అడవి శేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా. దాదాపు ఆరు దేశాల్లో 150 రోజులకు పైగా షూటింగ్ జరిగింది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.