Nikhil’s ‘Svayambhu’: డిసెంబర్ లో నిఖిల్ స్వయంభూ.?

నిఖిల్ స్వయంభూ.?

Update: 2025-09-08 05:04 GMT

Nikhil’s ‘Svayambhu’: నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కొత్త సినిమా స్వయంభూ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇది నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం. నిఖిల్ ఈ చిత్రంలో ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇది నిఖిల్ కెరీర్‌లో ఒక కొత్త ప్రయోగమని చెప్పవచ్చు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నిఖిల్ గెటప్ ఒక యోధుడిలా, శక్తివంతంగా కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతోన్న ఈ మూవీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ ఏడాది డిసెంబర్ చివర్లో రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారంట. నిఖిల్ కు ఇది 20 వ సినిమా. సంయుక్ష మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ యుద్ధ విద్యలు, కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ - ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీకి రవి బస్రూర్ (కేజీఎఫ్ ఫేమ్) మ్యూజిక్ అందిస్తున్నారు. భువన్‌ సాగర్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Tags:    

Similar News