Sai Pallavi’s Thoughtful Philosophy: ఏదీ శాశ్వతం కాదు : సాయి పల్లవి పిలాసఫీ ఇదే

సాయి పల్లవి పిలాసఫీ ఇదే;

Update: 2025-07-18 05:25 GMT

Sai Pallavi’s Thoughtful Philosophy: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి సాయి పల్లవి. ఈ చిత్రంలో తెలంగాణ యాసలో స్వయంగా డబ్బింగ్ చెప్పుకొని అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత 'ఎంసీఏ', 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగ రాయ్', 'విరాట పర్వం', 'గార్గి' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. సాయి పల్లవి కేవలం గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా, తన పాత్రకు కథలో ప్రాముఖ్యత, నటనకు అవకాశం ఉంటేనే సినిమాలు ఎంచుకుంటారు. భారీ ప్రాజెక్టులు లేదా స్టార్ హీరోల చిత్రాలైనా సరే, తన పాత్ర నచ్చకపోతే తిరస్కరించడానికి ఆమె వెనుకాడదు. ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌కు భారీ ఆఫర్‌ను తిరస్కరించిన సంఘటన ఆమె నిబద్ధతకు నిదర్శనం. సాయి పల్లవి ప్రస్తుతం రామాయణం మూవీలో సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఆమె టాలీవుడ్ సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవకాశాలు వస్తున్నప్పటికీ రిజెక్ట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తు న్నాయి. ఎందుకు రిజెక్ట్ చేస్తుందనే విషయంలో నటికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైఫ్ కు సంబంధించిన పిలాసఫీ నచ్చిందనే మాట వినిపిస్తోంది. రేపు ఏం జరుగుతుంది? భవిష్యత్ ఎలా ఉండబోతుంది? లాంటి ఆలోచనలు తారక్ మైండ్లో ఉండవు. ఈ క్షణం ఎలా ఉన్నా మన్నది ముఖ్యమంటాడు ఆయన. జీవితం నీటి బుడగ లాంటిదని.. మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదని నమ్ముతాడు. ప్రస్తుతం సాయి పల్లవి కూడా ఆ పిలాసఫీని అనుసరిస్తుందట. 'జీవితంలో ఏదీ శాశ్వంత కాదు. అన్నీ ఆశాశ్వతమే. ఇప్పుడు ఎంత ప్రేమ ఉన్నది అనేది ముఖ్యం. ఆ ప్రేమను ఇప్పుడు తీసుకున్నానా? లేదా? అన్ని ఆలోచిస్తాను. అది ఈ క్షణం మాత్రమే జరగాలి. తీసుకున్న ఆ క్షణం ఆస్వాదించాలి. అంతే గౌరవంగా ఉండాలి. ఈ ప్రేమ రేపు ఉండదు. మరోలా టర్న్ తీసుకోవచ్చు. అందుకే జీవితంలో ఏది ఇన్స్టంట్ గా జరిగినా దాన్ని తీసుకొని ముందుకు వెళ్లిపోవడమే' అంటూ పేర్కొంది. దీంతో టాలీవుడ్ కు దూరం కావడానికి కారణం కూడా అదేనా అనే విశ్లేషణలు మొదలయ్యాయి.

Tags:    

Similar News