'వార్ 2 లో హ్యూమన్ మిషన్‌ ఎన్టీఆర్‌

We showed NTR as a human mission - 'War 2' costume designer Anaita Shroff Adajania

Update: 2025-06-11 03:52 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో 'వార్ 2' చిత్రం రానున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ లుక్స్, స్టైలింగ్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఇక తన కాస్ట్యూమ్స్‌కి, తన పని తనానికి వచ్చిన ప్రశంసలు, అభిమానుల నుంచి వచ్చిన ప్రేమను చూసి 'వార్ 2' కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా ఆశ్చర్యపోయారు.

దేశంలోనే అత్యుత్తమ స్టైలిస్ట్‌గా గౌరవించబడే అనైతా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ''వార్ 2'లో మొదటిసారి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో పని చేయడం పూర్తిగా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుంటుంది. ఆయనలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ఆపై అతను పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ కోసం చాలా లుక్స్ డిజైన్ చేశాం. ఆయన పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాం. ఓ లక్ష్యంతో, ఉద్దేశ్యంతో పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశామ'ని అన్నారు.

ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రం 'వార్ 2'. కియారా అద్వానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆగస్టు 14న హిందీ, తమిళం , తెలుగు భాషలలో వార్ 2 భారీ ఎత్తున విడుదల కానుంది.

Tags:    

Similar News