OG Movie: సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా ఇప్పటికే పలు రికార్డులను సృష్టించింది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఈ రికార్డులను సాధించడం విశేషం. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ ద్వారా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.ఓజీ అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్ లో అత్యంత వేగంగా 500 లక్షల డాలర్ల( సుమారు రూ. 4.15కోట్లు) మార్కును దాటిన భారతీయ చిత్రంగా నిలిచింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ మార్కును చేరుకుంది.ఈ సినిమా దసరా పండుగ ముందు సెప్టెంబర్ 25న విడుదల కానుంది. అమెరికాలో ముందు రోజే సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధికంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.135 కోట్ల బిజినెస్ జరిగిందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా మొత్తం బిజినెస్ దాదాపు రూ. 200 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గత చిత్రాల రికార్డులను 'ఓజీ' ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా అధిగమించింది. అంతేకాకుండా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ను కూడా అధిగమించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న భారీ అంచనాల దృష్ట్యా, విడుదల తర్వాత మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఓజీలో ప్రియాంక మోహన్, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, నారా రోహిత కు కాబోయే భార్య సిరి లేళ్ల వంటి వాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.