Allu Sirish’s Wedding: అల్లు అర్జున్ పెళ్లి రోజునే.. అల్లు శిరీష్ పెళ్లి ఫిక్స్
అల్లు శిరీష్ పెళ్లి ఫిక్స్
Allu Sirish’s Wedding: అల్లు శిరీష్ తన పెళ్లి తేదీని చాలా కొత్తగా, ఒక సరదా వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు.అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికను మార్చి 6, 2026న వివాహం చేసుకోబోతున్నారు.అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పెళ్లి రోజు కూడా మార్చి 6నే (2011). ఇప్పుడు సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అదే తేదీన తమ్ముడు శిరీష్ కూడా ఓ ఇంటివాడు కాబోతుండటం విశేషం.
శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్రెండింగ్ రీల్ (Instagram Reel) పోస్ట్ చేశారు.ఈ వీడియోలో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్,ఆయన పెద్దన్నయ్య కుమార్తె అన్విత కలిసి నటించారు.పిల్లలు "బాబాయ్, మీ పెళ్లి ఎప్పుడు?" అని అడగ్గా, శిరీష్ , అయాన్ కలిసి "మార్చి 6" అని సమాధానం చెబుతారు.ఆ తర్వాత "సంగీత్ ఎప్పుడు?" అని అడగ్గా, "మనం సౌత్ ఇండియన్లం కదా, అలాంటివి చేసుకోము" అంటూ శిరీష్ సరదాగా సైగలు చేయడం ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ తన తమ్ముడికి ఇన్ స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ "ఈ డేట్ మా అందరికీ చాలా స్పెషల్" అని పోస్ట్ చేశారు.
2023లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి సందర్భంగా హీరో నితిన్ భార్య షాలిని ఇచ్చిన పార్టీలో నయనిక - శిరీష్ మొదటిసారి కలుసుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది అక్టోబర్ 31, 2025న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.