‘Toxic’: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్-ఇండియా చిత్రం టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఓపెనింగ్స్ సాధించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.140.75 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. టాక్ పరంగా మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది.

బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.140.75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో దేశీయ గ్రాస్ రూ.120.75 కోట్లు కాగా, విదేశాల నుంచి రూ.20 కోట్లు వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా 24,579 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమా మొదటి రోజు రూ.101.10 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

భాషల వారీగా నెట్ వసూళ్లు:

హిందీ: రూ.55.00 కోట్లు

కన్నడ: రూ.23.30 కోట్లు

తెలుగు: రూ.16.00 కోట్లు

తమిళం: రూ.5.50 కోట్లు

మలయాళం: రూ.1.30 కోట్లు

కేజీఎఫ్-2 రికార్డుకు చేరువలో..

యశ్ గత సంచలన చిత్రం కేజీఎఫ్: చాప్టర్ 2 తొలి రోజు దేశీయంగా రూ.116 కోట్ల నికర వసూళ్లు సాధించి ఆల్-టైమ్ రికార్డు నమోదు చేసింది. ‘టాక్సిక్’ ఆ మార్కును అందుకోలేకపోయినా, రూ.101.10 కోట్ల నెట్ కలెక్షన్లతో యశ్ కెరీర్‌లో రెండో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది.

ఈ చిత్రంలో నయనతార, కియారా అడ్వాణీ, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు.

Tags: