Ram Charan–Sukumar Combo: రామ్‌చరణ్ - సుకుమార్ కాంబో.. RC17 హీరోయిన్గా తెలుగమ్మాయి.. ?
తెలుగమ్మాయి.. ?
Ram Charan–Sukumar Combo: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో రంగస్థలం తర్వాత వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC17. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి నవంబర్ 1న ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అయితే, సినిమా లాంఛింగ్‌కు కొద్ది గంటల ముందు ఈ ప్రాజెక్ట్‌లోని హీరోయిన్ ఎంపిక టాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా మారింది.
స్టార్ హీరోయిన్లను కాదని కొత్త ముఖానికే మొగ్గు?
RC17 ప్రాజెక్ట్ మొదలవుతున్నప్పటి నుంచి కథానాయికగా రుక్మిణి వసంత్, సారా అర్జున్, అనీత్ పడ్డ, అనస్వర రాజన్ వంటి యువ నటీమణుల పేర్లు బలంగా వినిపించాయి. కానీ, దర్శకుడు సుకుమార్ తన పాత్రలోని పల్లెటూరి సహజత్వానికి, నేటివిటీకి పూర్తి న్యాయం చేసే కొత్త ముఖం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు సంతతి అమ్మాయి సాత్విక వీరవల్లి పేరును ఆయన దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవల జరిగిన స్క్రీన్ టెస్ట్‌లో ఆమె ప్రతిభ చిత్ర బృందాన్ని బాగా ఆకట్టుకుందని సమాచారం.
ఇంజనీరింగ్ పట్టా నుంచి రామ్ చరణ్ సినిమా వరకు: ఎవరీ సాత్విక వీరవల్లి?
సాత్విక వీరవల్లి నేపథ్యం చూస్తే ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని స్పష్టమవుతోందివ కుటుంబ మూలాలు చెన్నైకి చెందిన తెలుగు వారు కాగా, ఆమె అమెరికాలో జన్మించి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అమెరికాలోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్, వాండర్‌బిల్ట్ యూనివర్సిటీల నుంచి ఇంజనీరింగ్‌లో ఉన్నత పట్టాలు పొందారు. శాస్త్రీయ నృత్యంలో నిష్ణాతురాలైన సాత్విక, నటనపై మక్కువతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ఆకాశంలో ఒక తార చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.
అధికారిక ప్రకటనపైనే అందరి చూపు
మొదటి చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే రామ్ చరణ్-సుకుమార్ లాంటి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అవకాశం అందుకోవడం అంటే సాత్విక కెరీర్‌కు అది తిరుగులేని అవకాశమనే చెప్పాలి. నవంబర్ 1న జరగనున్న పూజా ముహూర్తంలో చిత్ర యూనిట్ దీనిపై అధికారికంగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.