Ram Pothineni: రామ్ డెడికేషన్..24 గంటలు నాన్ స్టాప్ షూటింగ్
నాన్ స్టాప్ షూటింగ్
Ram Pothineni: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహిస్తున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ర్యాపో 23'. కెరీర్ పరంగా ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్రబృందం, ప్రస్తుతం పాండిచ్చేరిలో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తోంది.
పాండిచ్చేరి షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే తొమ్మిది రోజులకు పైగా షూటింగ్ జరగగా.. మధ్యలో వర్షాల కారణంగా కొన్నిసార్లు బ్రేకులు పడ్డాయి. అయినప్పటికీ సమయాన్ని వృథా చేయకుండా టీమ్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా నటుడిగా కెమెరా ముందుటమే కాకుండా, దర్శకుడిగా కెమెరా వెనుక కూడా అంకితభావంతో పనిచేస్తున్న రామ్ పోతినేని.. ఏకంగా 24 గంటల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొని సినిమాపై తనకున్న ప్యాషన్‌ను నిరూపించుకున్నారు.
ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, కమర్షియల్ హంగులు కూడా భారీగానే ఉండనున్నాయి. ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.