Ramayana: 2026 దీపావళి కానుకగా రామాయణం: పార్ట్ 1.. విడుదల తేదీ ఫిక్స్
విడుదల తేదీ ఫిక్స్
Ramayana: భారతీయ సినిమా చరిత్రలో అపూర్వ దృశ్యకావ్యంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణం: పార్ట్ 1 రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంటూ, ఈ మైథలాజికల్ విజువల్ వండర్ 2026 నవంబర్ 5న దీపావళి కానుకగా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించింది.
శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, లంకేశ్వరుడు రావణుడిగా కన్నడ స్టార్ యశ్, లక్ష్మణుడిగా రవి దూబే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటోంది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ (యశ్) సంయుక్తంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. మొదటి భాగాన్ని 2026 దీపావళికి విడుదల చేస్తుండగా, రెండో భాగం 'రామాయణం: పార్ట్ 2 ను 2027 దీపావళికి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించారు.
గ్లోబల్ టెక్నికల్ టీమ్
ఆస్కార్ పురస్కార గ్రహీత సంస్థ DNEG విజువల్ ఎఫెక్ట్స్ పనులను పర్యవేక్షిస్తుండగా, సంగీత దిగ్గజాలు ఏ.ఆర్. రెహమాన్, హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్ కలిసి స్వరాలు సమకూరుస్తున్నారు. సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ బాధ్యతలు చేపట్టగా, హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఐమ్యాక్స్ సాంకేతికతతో ఈ చిత్రం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. "ఇది రాముని యుగానికి ఆరంభం" అంటూ చిత్రయూనిట్ విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రస్తుతం సినీ ప్రియుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. దసరా నుంచి చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుకానున్నాయి.