ఎన్నో ట్విస్టులు, ఉత్కంఠభరితమైన పోరాటాలు, మైండ్ గేమ్‌ల మధ్య సాగిన ప్రముఖ రియాలిటీ షో 'MX ఒరిజినల్ రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2' అట్టహాసంగా ముగిసింది. బన్నీజే ఆసియా నిర్మించిన ఈ గ్రాండ్ ఫినాలేలో షెహజాద్ పూనావాలా విజేతగా నిలిచి, ప్రతిష్టాత్మక ట్రోఫీతో పాటు రూ.35 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు.

వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో 15 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్లు విభిన్నమైన వ్యూహాలతో, పట్టుదలతో తలపడి ప్రేక్షకులను ఆద్యంతం అలరించారు.

గ్రాండ్ ఫినాలే హంగామా!

టాప్ 6 ఫైనలిస్టుల విద్యుత్‌లాంటి డాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ఫినాలే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం ఎలిమినేట్ అయిన మాజీ కంటెస్టెంట్లు తిరిగి వచ్చి సందడి చేశారు.

మొదటి ఎలిమినేషన్ : 'ఫార్చ్యూన్ ఫ్లోర్ పిరమిడ్' ఛాలెంజ్‌లో నిహారిక తివారీ నిష్క్రమించడంతో పోటీ టాప్ 5కి చేరింది.

కామెడీ & ఎమోషన్ : హర్ష్ గుజ్రాల్ తన టైమింగ్ కామెడీతో నవ్వులు పూయించగా, ఫైనలిస్టుల కుటుంబ సభ్యులు వేదికపైకి రావడంతో ఫినాలే ఎమోషనల్‌గా మారింది.

టాప్ 3 పోటీదారులు : కరణ్ పటేల్, స్వరా భాస్కర్ ఎలిమినేట్ అవ్వడంతో ప్రియాంక చాహర్ చౌదరి, గౌతమ్ గులాటీ, షెహజాద్ పూనావాలా టాప్ 3 రేసులో నిలిచారు.

చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్!

ఫినాలే ముగింపు దశలో టాప్ 3 సభ్యుల మధ్య ఓటింగ్ టై కావడంతో, ఎలిమినేట్ అయిన మిగిలిన కంటెస్టెంట్లు విజేతను నిర్ణయించే బాధ్యత తీసుకున్నారు. వారి నిర్ణయంతో

సెకండ్ రన్నరప్‌గా గౌతమ్ గులాటీ నిలిచారు. ప్రియాంక చాహర్ చౌదరి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. షెహజాద్ పూనావాలా సీజన్ 2 అల్టిమేట్ 'రూలర్'గా విజేత నిలిచారు.

"ఈ గెలుపు నా పట్టుదలకు నిదర్శనం" - షెహజాద్ పూనావాలా

విజయం సాధించిన అనంతరం షెహజాద్ మాట్లాడుతూ — "రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2 గెలవడం మాటల్లో చెప్పలేని అనుభూతి. పెెంట్‌హౌస్ వైభవం నుండి బేస్‌మెంట్ కష్టాల వరకు ఈ ప్రయాణం ఎంతమాత్రం సులువు కాదు. కానీ నాపై నాకు ఉన్న నమ్మకమే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది. ఈ విజయం నా పట్టుదలకు, నిలకడకు దక్కిన ప్రతిఫలం. బన్నీజే ఆసియా, ప్రైమ్ వీడియో బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు"* అని సంతోషం వ్యక్తం చేశారు.

నిర్వాహకుల కామెంట్స్

అమోఘ్ దుసాద్ (ప్రైమ్ వీడియో ఇండియా) : "ఈ సీజన్‌కి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అద్భుతం. వ్యూహాలు, మైండ్ గేమ్‌లతో కూడిన ఈ రియాలిటీ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విజేత షెహజాద్‌కి నా అభినందనలు."

దీపక్ ధర్ (బన్నీజే ఆసియా & ఎండెమోల్ షైన్ ఇండియా CEO): "విభిన్నమైన కంటెస్టెంట్లతో ఈ సీజన్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. షోను ఇంత పెద్ద హిట్ చేసిన వీక్షకులకు ధన్యవాదాలు."

ఎక్కడ చూడవచ్చు?

వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్ చేసిన 'రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2' గ్రాండ్ ఫినాలేతో పాటు అన్ని ఎపిసోడ్లు ప్రైమ్‌ వీడియోలో ఉచితంగా స్ట్రీమ్ అవుతున్నాయి. అలాగే MX ప్లేయర్‌ యాప్, కనెక్టెడ్ టీవీలు మరియు ఫైర్ టీవీలలో కూడా ఉచితంగా చూడవచ్చు.

Tags: