Shanaya Kapoor: ఇన్‌ఫ్లూయెన్సర్ పాత్రలో శనయా కపూర్..!
“Tu Yaa Main" చిత్ర విశేషాలు పంచుకున్న నేపో కిడ్..!
శనయా కపూర్ తొలి చిత్రం ఆమె కెరీర్‌కు పెద్ద ప్రశంసలు తెచ్చిపెట్టకపోయినా, ఆమె చేతిలో ఇప్పటికే పలు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నెపో కిడ్‌కు మరో కొత్త ప్రాజెక్ట్ “Tu Yaa Main". ఈ చిత్రంలో ఆమె ఒక ఇన్‌ఫ్లూయెన్సర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా హిట్ సినిమా “ఖూన్ భరీ మాంగ్” కి ఆధునిక జనరేషన్ టచ్‌తో చేసిన ట్విస్ట్‌గా ఉండబోతోంది.
జెన్-జెడ్ ప్రేమకథ నేపథ్యంతో, శనయా కపూర్ నటనలో పదునైన, ఉత్సాహభరితమైన కెమిస్ట్రీ కనిపించనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఆదర్శ్ గౌరవ్‌కు జోడిగా ఆమె నటిస్తోంది. ట్రైలర్ ఆధారంగా చూస్తే, బాలీవుడ్‌కు ఇటీవలి కాలంలో కొరవడిన కొత్తదనం, ఆధునిక ఎనర్జీ ఈ చిత్రంలో కనిపించబోతోందని అనిపిస్తోంది. మొసలివున్న ఒక పూల్‌లో చిక్కుకున్న ఈ ఇద్దరు యువ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఎలా బతుకుతారనే అంశమే కథ సారాంశం.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా శనయా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వారి రాబోయే సర్వైవల్ రొమాన్స్ థ్రిల్లర్—“Tu Yaa Main" గురించి ఆమె మాటల్లో :
ఈ సినిమా అవకాశం మీకు ఎలా వచ్చింది?
ముకేశ్ సర్ (ముకేశ్ ఛాబ్రా) నాకు కేవలం రెండు సీన్స్ మాత్రమే పంపించారు—పూర్తి స్క్రిప్ట్ లేదు. అవి చదివిన వెంటనే ఆడిషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆయనే సీన్స్ రికార్డ్ చేయడానికి సహాయపడ్డారు, అవి ఆనంద్ సర్‌కి పంపుతామని చెప్పారు. అంతే నాకు తెలిసింది. నా వంతు శక్తినంతా పెట్టి ఆడిషన్ ఇచ్చాను. చివరికి ఆనంద్ సర్‌ను కలిసినప్పుడు, నాపై ఆయన చూపించిన నమ్మకం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నిజంగా చెప్పాలంటే, ఆ నమ్మకమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది.
పూర్తి స్క్రిప్ట్ చదివిన తర్వాత ఒప్పుకోవడానికి కారణం ఏమిటి?
అన్నీ! ఈ కథలో ప్రేమ ఉంది, హారర్ ఉంది, థ్రిల్లర్ ఉంది, డ్యాన్స్ ఉంది, కామెడీ ఉంది—ఇంకేం కావాలి? హారర్ కామెడీలు చూశాం, రామ్‌కామ్స్ చూశాం… కానీ సర్వైవల్ థ్రిల్లర్‌లో రొమాన్స్? అది పిచ్చే! ఈ సినిమా చేయకుండా ఉండలేకపోయాను.
ట్రైలర్ చూసిన తర్వాత మీ వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏమిటి?
ఖచ్చితంగా ఆదర్శ్‌తో కలిసి సినిమా చూడటమే ప్లాన్—సాల్టెడ్ కారమెల్ పాప్‌కార్న్, చీజ్ కూడా!
మీ తొలి సినిమా రొమాంటిక్ జానర్, ఇది మాత్రం పూర్తిగా భిన్నమైనది.
ఆ మార్పు ఎలా అనిపించింది?
చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది—అదే నన్ను ఆకట్టుకుంది. ఈ పాత్రలో ప్రేమ మాత్రమే కాదు, లోపలి సంఘర్షణలు, నెగటివ్ షేడ్స్, సర్వైవల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది నా కంఫర్ట్ జోన్ బయటకు తీసుకెళ్లింది. రిస్క్ తీసుకుని నటిగా ఎదగాలనుకున్నాను.
‘మిస్ వానిటీ’ అనే ఇన్‌ఫ్లూయెన్సర్ పాత్రను ఎలా సిద్ధం చేసుకున్నారు?
మేము ఆమెను స్టీరియోటైప్‌గా చూపించకపోవడం నాకు చాలా నచ్చింది. ఇన్‌ఫ్లూయెన్సర్ల గురించి అందరికీ ముందే అభిప్రాయాలు ఉంటాయి, కానీ ఆమె నిజమైన అమ్మాయి—ఒక భయంకర పరిస్థితిలో చిక్కుకుంటుంది. రాత కూడా క్లిషేలకు దూరంగా ఉండటం నాకు చాలా ఉపయోగపడింది.
ఇంత లేయర్డ్ పాత్ర కోసం ఏ రకమైన ప్రిపరేషన్ చేశారు?
అతుల్ ముంగియా సర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన నన్ను చాలా డీప్ గా గైడ్ చేశారు. కొత్త యాక్టింగ్ టెక్నిక్స్‌పై పనిచేశాం, ‘యానిమల్ వర్క్’ కూడా చేసాం—మీ పాత్రను ప్రతిబింబించే జంతువును ఊహించుకోవడం లాంటి పద్ధతులు. అవి షూటింగ్ అంతా పాత్రలో ఉండటానికి నాకు చాలా సహాయపడ్డాయి.
దర్శకుడు బిజోయ్ సర్‌తో పని చేసిన అనుభవం ఎలా ఉంది?
చాలా స్వేచ్ఛగా అనిపించింది. మొదటిసారి ఒక సెట్లో నా ఆలోచనలు పూర్తిగా చెప్పగలిగాను. ఏదైనా సీన్ సరిగ్గా అనిపించకపోతే మార్చేవాళ్లం. ఎలాంటి కఠినమైన నియమాలు లేవు—పాత్రకు నిజాయితీగా ఉండటమే ముఖ్యం. ఆ స్వేచ్ఛే పాత్రను రియాలిస్ట్ గా ఉండేలా చేసింది
ఈ పాత్ర కోసం మిమ్మల్ని ప్రభావితం చేసిన సినిమాలు ఏవైనా ఉన్నాయా?
అవును—“క్రాల్”. ఈ సినిమా గురించి విన్నాక నా చిన్న తమ్ముడు చాలా ఎగ్జైట్ అయ్యాడు—ఇల్లు అంతా మొసలి బొమ్మలతో నిండిపోయింది! అతని ఒత్తిడితోనే నేను సినిమా చూసాను, చాలా నచ్చింది.
మీ కుటుంబం ఈ ప్రాజెక్ట్‌కు ఎలా స్పందించింది?
నా నాన్నకు ఈ విషయం తెలిసినప్పుడు చాలా ఆనందం వేసింది, ఎందుకంటే బిజోయ్ సర్ ఇందులో ఉన్నారు. ఆయనతో మళ్లీ కలిసి పనిచేస్తారని ఆయన ఎప్పటినుంచో అడుగుతూనే ఉండేవారు. మా కుటుంబం మొత్తం చాలా ఉత్సాహంగా, సపోర్టివ్‌గా ఉంది.
మీ వ్యక్తిగత జీవితాన్ని పాత్రల్లో ఎంతవరకు తీసుకొస్తారు?
చాలా వరకు. భావోద్వేగాల పరంగా పోలికలు కనుగొనడం ముఖ్యం అనుకుంటాను. ఇన్‌ఫ్లూయెన్సర్ పాత్ర కాబట్టి, చాలా మంది ఇన్‌ఫ్లూయెన్సర్లను కలిశాను—వాళ్ల రొటీన్, మాట్లాడే తీరు, క్యాప్షన్లు, కెమెరా ఆన్ అయినప్పుడు వాళ్ల ప్రవర్తన ఎలా మారుతుందో గమనించాను. నటులు కూడా అలాగే చేస్తారు కదా. ఆ రీసెర్చ్ ఈ పాత్రను రూపొందించడంలో నాకు బాగా సహాయపడింది.