Sharwanand’s 36th Movie: శర్వానంద్ 36వ సినిమా టైటిల్,ఫస్ట్ లుక్ రివీల్

సినిమా టైటిల్,ఫస్ట్ లుక్ రివీల్

Update: 2025-10-20 10:01 GMT

Sharwanand’s 36th Movie: దీపావళి రోజు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు యంగ్ హీరో శర్వానంద్. తన కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ 'బైకర్ గా ఖరారు చేశారు. ఇది ఆయన 36వ చిత్రం (Sharwa 36), దీనికి అభిలాష్ రెడ్డి కంకరా దర్శకత్వం వహిస్తున్నారు.స్టైలిష్, యూత్ ఫుల్ లుక్‌లో శర్వా అదరగొట్టారు. 'జీవితంలో ప్రతీ మూలను, ప్రతీ జంప్‌ను, ప్రతీ అడ్డంకిని జయించి కీర్తిని లక్ష్యంగా పెట్టుకోండి.' అంటూ రాసుకొచ్చారు.

ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది.యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో సీనియర్ హీరో రాజశేఖ‌ర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ‌ర్వానంద్ తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మాజి, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే శర్వానంద్ 38వ సినిమా టైటిల్ 'భోగిగా రివీల్ అయింది. ఇది సంపత్ నంది దర్శకత్వంలో రాబోతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా.

Tags:    

Similar News