Sreeleela Responds to Viral AI Photos: వైరల్ అవుతున్న AI ఫోటోలపై స్పందించిన శ్రీలీల.. చేతులెత్తి విజ్ఞప్తి!
చేతులెత్తి విజ్ఞప్తి!
Sreeleela Responds to Viral AI Photos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ రోజురోజూ అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దాని దుర్వినియోగం సినీ పరిశ్రమలోని నటీమణులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కొందరు నెటిజన్స్ ఈ టెక్నాలజీని ఉపయోగించి హీరోయిన్ల ముఖాలతో అసభ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలు, డీప్ ఫేక్ ఇమేజెస్ సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇటీవల రష్మిక మందన్న తర్వాత ఇప్పుడు యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటోంది.
శ్రీలీల ముఖంతో ఎడిట్ చేసిన AI జనరేటెడ్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె బాత్‌రూమ్‌లో టవల్ కప్పుకుని అద్దం ముందు సెల్ఫీలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ ఇమేజెస్ అత్యంత రియలిస్టిక్‌గా ఉండటంతో చాలామంది నెటిజన్స్ శ్రీలీలను ట్రోల్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి పూర్తిగా నకిలీవని శ్రీలీల స్వయంగా స్పష్టం చేసింది.
తాజాగా శ్రీలీల తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ ఈ విషయంపై స్పందించింది. “సోషల్ మీడియా వినియోగదారులందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. అర్థంలేని AI జనరేటెడ్ కంటెంట్‌ను సమర్థించవద్దు, ప్రోత్సహించవద్దు. టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించడం, దుర్వినియోగం చేయడం మధ్య తేడా ఉంది. టెక్నాలజీ పురోగతి జీవితాన్ని సులభతరం చేయడానికి, కాదు క్లిష్టతరం చేయడానికి” అని పేర్కొంది.
సినీ పరిశ్రమలోని ప్రతి అమ్మాయి ఎవరికో కుమార్తె, మనవడు, సోదరి లేదా స్నేహితురాలు అని గుర్తు చేస్తూ, “మేం సురక్షితమైన వాతావరణంలో ఆనందాన్ని పంచుతూ పని చేయాలని కోరుకుంటున్నాం” అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న అనేక విషయాలు తనకు తెలియవని, ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. “చిన్న విషయాలు పట్టించుకోను, నా ప్రపంచం నాదే. కానీ ఇలాంటి వాటి మీద నన్ను బాధిస్తాయి. నా తోటి సహనటులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. వారి తరపున కూడా మాట్లాడుతున్నాను. గౌరవంతో, నమ్మకంతో మా పక్కన నిలబడండి. మిగతాది అధికారులు చూసుకుంటారు” అని శ్రీలీల విజ్ఞప్తి చేసింది.
ఈ ఘటన సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్‌లపై మరోసారి చర్చనీయాంశంగా మారింది. AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.