SSMB 29: SSMB 29..రామోజీ ఫిల్మిం సిటీలో లక్షమందితో ఈవెంట్
లక్షమందితో ఈవెంట్
SSMB 29: మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'SSMB 29 సినిమా టైటిల్ ,ఫస్ట్ గ్లింప్స్ విడుదల కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 15న జరగనున్న ఈ ఈవెంట్‌కు లక్ష మందికి పైగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అభిమానులు ఇప్పటికే పాస్‌ల కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు, రాజమౌళి, హీరోయిన్ ప్రియాంక చోప్రా సహా ఇతర టీమ్ సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది.
ఈ ఈవెంట్‌ను హాలీవుడ్ స్థాయిలో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఈవెంట్‌ను మొట్టమొదటిసారిగా ఒక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో (జియో హాట్‌స్టార్) లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.ప్రస్తుతానికి, ఈ ఈవెంట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, నవంబర్ 15న ఈ 'ఫస్ట్ రివీల్' కార్యక్రమం జరగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారని మహేష్ బాబు, రాజమౌళి మధ్య జరిగిన సోషల్ మీడియా సంభాషణ ద్వారా దాదాపుగా ఖరారైంది. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది..కెన్యాలోని అడవుల్లో ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు రూ. 50 కోట్ల భారీ ఖర్చుతో వేసిన వారణాసి (కాశీ) సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.