‘Romanchakam’: సుమంత్ ప్రభాస్ రోమాంచకం రిలీజ్ డేట్ ఫిక్స్
రిలీజ్ డేట్ ఫిక్స్
‘Romanchakam’: సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో తెరకెక్కిన సరికొత్త బడ్డీ కామెడీ చిత్రం రోమాంచకం. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబరు 3న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనిట్ సభ్యులు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
దర్శకుడు వేణుగోపాల్ కథ చెబుతున్నంత సేపూ నాన్‌స్టాప్‌గా నవ్వుతూనే ఉన్నాను. పేపర్‌పై రాసుకున్న కథను తెరపైకి అంతే అద్భుతంగా తీసుకొచ్చారు. సినిమా చూశాక ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది అని సుమంత్ అన్నారు. ఇదొక సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్. ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది’’ అని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా అన్నారు.