'The Paradise' Teaser Released: ది ప్యారడైజ్ టీజర్ విడుదల .. రఫ్ అండ్ మాస్ లుక్‌లో అదరగొట్టిన నాని
అదరగొట్టిన నాని
'The Paradise' Teaser Released: ఎవడు పడితే వాడు ఏలేయడానికి ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు...ది ప్యారడైజ్ సరికొత్త ప్రపంచం తెరపైకి వచ్చింది! టెర్రిఫిక్ కాంబినేషన్... దసరా వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల జోడీ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. తాజాగా విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ రేంజ్‌కు వెళ్లిపోయాయి.
జడల్ అనే పవర్‌ఫుల్, మాస్ క్యారెక్టర్‌లో నాని నటన అద్భుతం. మేకోవర్, బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాయి. 'ఇక నుంచి... ఈ జాగా ఎవరిది.. మనదే, ఈ దేశం ఎవరిది.. మనదే' అంటూ నాని చెప్పిన డైలాగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. ఇక 'అణచబడ్డ మన జాతి మర్లపడాలే...' అంటూ సాగే సంభాషణలు సినిమాలోని ఇంటెన్సిటీ ఏ స్థాయిలో ఉండబోతుందో స్పష్టం చేస్తున్నాయి.
శవాల గుట్టపై కూర్చుని నాని తనకు తాను దిష్టి తీసుకునే విజువల్ టీజర్‌కే అసలైన హైలైట్. శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ విజువల్స్, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. అంతేకాదు, 'మేరి ప్యారీ పారడైజ్ వాసియోం..' అంటూ పవర్‌ఫుల్ గెటప్‌లో నటిస్తున్న మోహన్ బాబు లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కయాదు లోహర్, రాఘవ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టైటిల్, పోస్టర్స్ నుంచి మొదలైన ప్రమోషన్స్ ఇప్పుడు ఈ పవర్‌ఫుల్ టీజర్‌తో పీక్స్‌కు చేరాయి. సరికొత్త లోకాన్ని పరిచయం చేయడానికి వస్తున్న ఈ 'ప్యారడైజ్' సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద మరో భారీ ప్రభంజనం సృష్టించడానికి రెడీ అవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు