విజయ "వైభవం" ప్రత్యేకం

"Vaibhavam" movie is entertaining the audience

Update: 2025-05-24 11:50 GMT

"వైభవం" చిత్రానికి వస్తున్న విజయ స్పందన తమకు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని... ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సాత్విక్... హీరోగా ఇంట్రడ్యూస్ అయిన రుత్విక్ పేర్కొన్నారు. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు కావడం విశేషం. విద్యాధికులైన ఈ సోదరుల్లో.. తమ్ముడు సాత్విక్ దర్శకుడిగా అన్నయ్య రుత్విక్ హీరోగా పరిచయమవుతూ... తల్లి రమాదేవి నిర్మాతగా రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "వైభవం" ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి... అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరాభిమానాలు విశేషంగా చూరగొంటోంది. ఇక్రా ఇద్రిసి కథానాయకి.

భావోద్వేగాలకు, మానవతా విలువలకు పెద్ద పీట వేస్తూ క్లీన్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరరకెక్కిన "వైభవం" దక్కించుకుంటున్న విజయవైభవం పట్ల ఈ సోదరులు తమ హర్షాతిరేకం వ్యక్తం చేశారు. థియేటర్లలో వస్తున్న స్పందన రెండేళ్లకు పైగా తాము పడిన కష్టం మర్చిపోయేలా చేసిందని వారు తెలిపారు. ఈ చిత్రం రూపకల్పనలో సహాయసహకారాలు అందించిన నటీనటులు, సాంకేతికనిపుణులు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా రుత్విక్ - సాత్విక్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News