Venkatesh’s Blockbuster Movie: బాలీవుడ్ లోకి వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ
వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ
Venkatesh’s Blockbuster Movie: టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' హిందీ రీమేక్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ రీమేక్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ తెలుగు బ్లాక్‌బస్టర్‌ను నిర్మించిన దిల్ రాజు గారే, హిందీ రీమేక్‌ను కూడా తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు తెలుస్తోంది.బాలీవుడ్‌లో 'సింగ్ ఈజ్ కింగ్', 'భూల్ భులయ్య 2', 'వెల్‌కమ్' వంటి హిట్ కామెడీ చిత్రాలకు దర్శకత్వం వహించిన అనీస్ బజ్మీ ఈ హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' (2025) తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. సుమారు రూ. 250 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు వసూళ్లు సాధించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కథాంశం అక్షయ్ కుమార్ ఇమేజ్‌కి, కామెడీ టైమింగ్‌కి బాగా సరిపోతుందని భావించి దిల్ రాజు అక్షయ్ కుమార్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ కూడా ఈ కథ పట్ల ఆసక్తి చూపారని, ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.