Vijay Antony’s ‘Nanna Kutti’: తండ్రీకూతురు అనుబంధానికి అద్దం.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ నవంబర్ 27న విడుదల
| నవంబర్ 27న విడుదల
Vijay Antony’s ‘Nanna Kutti’: విజయ్ ఆంటోని, ప్రీతి అస్రానీ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’ నవంబర్ 27న తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ము.మారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించగా, రామాంజనేయులు జవ్వాజీ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే తమిళంలో ‘అప్పా కుట్టి’ పేరుతో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ “గత వారం తమిళంలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. చూసినవారంతా సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్‌గా ఉందని మెచ్చుకుంటున్నారు” అని చెప్పారు.
‘బిచ్చగాడు’ నచ్చిన అందరికీ ఈ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుందని, ప్రీతి అస్రానీ అద్భుతంగా నటించిందని ఆయన పేర్కొన్నారు. తెలుగులో విడుదల చేస్తున్న సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
కథానాయిక ప్రీతి అస్రానీ మాట్లాడుతూ “నాన్న గొప్పదనం, త్యాగాన్ని చూపిస్తూ నాన్న ప్రేమను సెలెబ్రేట్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. తల్లి ప్రేమను ఎంతో జరుపుకుంటాం కానీ తండ్రి ప్రేమకు అంత గుర్తింపు రాదు. ఈ చిత్రం దానిని ఆవిష్కరిస్తుంది” అని చెప్పారు.
దర్శకుడు ము.మారన్ “తండ్రీకూతుళ్ల రిలేషన్‌ను అద్భుతంగా చూపించాము. ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు” అని వెల్లడించారు. నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను మగవాళ్లందరికీ అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ‘కిష్కింధపురి’ దర్శకుడు కౌశిక్ అతిథిగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. లారా విజయ్ ఆంటోని, రచయిత భాష్యశ్రీ, సింగర్ మౌషిమి నేహా తదితరులు పాల్గొన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ లిథాన్య పాత్రతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని హీరో పేర్కొన్నారు.
సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ ఆంటోని, ప్రీతి అస్రానీ అమీర్‌పేటలో రోడ్డుపై మిర్చి బజ్జీలు స్వయంగా వేసి అందరికీ పంచి సందడి చేశారు. అంతకుముందు చెన్నై నుంచి కోయంబత్తూరుకు జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణించి వైరల్ అయ్యారు.
విజయ్ ఆంటోని సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా చేపట్టారు. రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ చేయగా, భగవతి పెరుమాళ్, హరిప్రియా ఇసై, అరువి మధన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలగలిసిన ఈ ఫ్యామిలీ డ్రామా నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.