జాకీ కోసం వాట్సాప్ కుకింగ్‌ - రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

WhatsApp Cooking for Jackie - Rakul Preet Singh's interesting comments

Update: 2025-06-20 10:25 GMT

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన భర్త జాకీ భగ్నానీ కోసం వంట ఎలా చేస్తుందో చెప్పింది. స్వయంగా వంట చేయడం రాకపోయినా, “వాట్సాప్ కుకింగ్” ద్వారా జాకీకి ఇష్టమైన వంటకాలు తయారయ్యేలా చూస్తానని వెల్లడించింది. “నాకు వంట రాదు కానీ వంట ఎలా చేయాలో బాగా తెలుసు. కుకింగ్ సమయంలో ఫోన్‌లో చెఫ్‌కి గార్లిక్ ఎప్పుడు వేయాలో, అల్లం ఎప్పుడు వేయాలో చెబుతా. నేను ఇచ్చిన రెసిపీ జాకీకి బాగా నచ్చుతుంది. వాటిని ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లోంచి తీసుకుని చెఫ్‌కి చెప్పి చేయిస్తా,” అంటూ వివరించింది. తన ఇష్టాలు, అభిరుచులు జాకీతో చాలా పోలి ఉంటాయని చెప్పిన రకుల్, ప్రతిరోజూ తమ స్థాయిలో ఏదో ఒక కొత్తగా తయారుచేయాలనే ప్రయత్నం చేస్తుంటా అని కూడా చెప్పింది.

ఇక, కార్పొరేట్ ఉద్యోగులకు రకుల్ ఫిట్‌నెస్ గురించి కూడా ఒక చిన్న సలహా ఇచ్చింది. 'ది రైట్ యాంగిల్ విత్ సోనాల్ కాల్రా' అనే కార్యక్రమంలో మాట్లాడిన రకుల్, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుండే ఉద్యోగుల కోసం ఈజీ చెయిర్ యోగా టిప్స్ షేర్ చేసింది. తక్కువ సమయంతో, పని మధ్యలోనే వీటిని చేయొచ్చని, ఇవి శరీరానికి తేలికగా ఉపశమనం ఇస్తాయని ఆమె చెప్పింది.



Tags:    

Similar News