స్పాట్ బుకింగ్‌లు రోజుకు 5వేల మందికే
TDB Implements New Restrictions as Pilgrim Rush Rises in Sabarimala Forest Route Pilgrims Now Require Special Passes, Says Devaswom Board
స్పాట్ బుకింగ్‌లు 5వేల మందికే ...!
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం..
అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే భక్తలకు నీలక్కల్ వద్ద అన్ని ఏర్పాట్లు..
శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి దర్శనానికి స్పాట్ బుకింగ్‌లను 5వేలకు తగ్గించింది. అంతే కాకుండా అడవి నడక మార్గంలో వస్తున్న భక్తులకు పాస్‌లు జారి చేస్తున్నట్లు తెలిపింది
శబరిమలకు స్వాముల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్థానం స్పాట్ బుకింగ్‌లను రోజుకు 5 వేలకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తొలుత 20వేల వరకూ స్పాట్ బుకింగ్‌లు ఇవ్వాలని దేవస్థానం భావించింది. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా స్పాట్ బుకింగ్‌లను సోమవారం వరకు రోజుకు 5వేలకు మాత్రమే పరిమితం చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అడవి నడకమార్గంలో ప్రయాణించే స్వాములు ప్రత్యేక పాసులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. శబరిమలకు అడవిమార్గంలో వచ్చే భక్తుల పాసులు సైతం 5వేలకు పరిమితం చేయాలని దేవస్థానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. బుకింగ్‌లకు గాను ఒక కౌంటర్ పంప వద్ద మరో 7కౌంటర్లు నిలక్కల్ వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకొని అవసరమైతే స్పాట్ బుకింగ్‌లు 10వేలకు పెంచుతామని తెలిపింది. మెుదట వచ్చిన భక్తులకే పాస్‌లు లభిస్తాయని ప్రకటించింది.
అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే భక్తలకు నీలక్కల్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులకు తాగునీరు, టీ ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. పంపా చేరుకొని స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులందరూ నిర్ణిత సమయంలో తిరిగి వెనక్కి రావాలని పేర్కొన్నారు.