Devotional: గర్భిణీ స్త్రీలు తప్పకుండా చదవ వలసిన మహా మంత్రము
చదవ వలసిన మహా మంత్రము;
Devotional: కష్ట సుఖాలు, కలిమి లేములు, సంతతి కలగడం, కలగక పోవడం, కలిగిన సంతతి అల్పాయువుగా వుండడం, చిరంజీవిగా వుండడం ఇదంతా కర్మ ఫలాలను బట్టి వుంటుంది. అంతా కర్మాధీనం అని వేదం చెబుతుంది. షష్టీ దేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఈ దేవి కధ చాలా మహిమ గలది. ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ (ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక ఆమెకు షష్టీ దేవి అని పేరు వచ్చినది. పేరు దేవ సేన. ఈమె కుమార స్వామికి ప్రియురాలు. శిశు రక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్య మాత. ఈమెకు సంబంధించిన కధ వ్రాసినా, వినినా, చదివినా సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా గర్భముతో వున్నవాళ్ళు తప్పక రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము ఇది.
* షష్టీ దేవి స్తోత్రము
నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ద్యై, శాంత్యై, నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ట్యై షష్టా౦శరూపాయై, సిద్దాయై చ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః
సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాధిష్టాతృ దేవ్యై చ షష్టీ దేవ్యై నమో నమః
కళ్యాణ దేవ్యై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం
ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవ రక్షణకారిణ్యై షష్టీ దేవ్యై నమో నమః
శుద్ధసత్వ స్వరూపాయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధ వర్జితాయై షష్టీ దేవ్యై నమో నమః
ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి!
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి!
ధర్మం దేహి యశోదేహి షష్టీ దేవీ నమో నమః !
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే !
కళ్యాణం చ జయం దేహి, విద్యా దేవి నమో నమః!
ఫలశృతి :
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత
షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం
వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే
వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే
శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం.
సంతానం లేని వారు, కొడుకును కోరి షష్టీ దేవిని పూజించి యీ స్తోత్రముతో శ్రద్దా భక్తులతో పఠిస్తూ వుంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు.