Alert for Sabarimala Devotees: శబరిమల భక్తులకు అలెర్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
హైకోర్టు కీలక ఆదేశాలు
Alert for Sabarimala Devotees: మండల-మకరవిళక్కు పూజా సీజన్ ప్రారంభమైన తర్వాత శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో ఆలయ పరిసరాల్లో, క్యూలైన్లలో తీవ్ర రద్దీ ఏర్పడింది. భక్తుల భద్రత దృష్ట్యా, రద్దీని నియంత్రించేందుకు కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 24వ తేదీ వరకు రోజువారీ దర్శనం చేసుకునే భక్తుల సంఖ్యను 75,000కు పరిమితం చేయాలని హైకోర్టు ఆదేశించింది.తక్షణ బుకింగ్‌ల ద్వారా అనుమతించే భక్తుల సంఖ్యను 5,000కు తగ్గించాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB)కి స్పష్టం చేసింది. గతంలో ఈ సంఖ్య 20,000గా ఉండేది. ఆలయానికి రెండు రోజుల్లోనే దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలిరావడంతో ఏర్పడిన రద్దీపై కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సరైన ఏర్పాట్లు లేకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆలయానికి రెండు రోజుల్లోనే దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలిరావడంతో ఏర్పడిన రద్దీపై కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సరైన ఏర్పాట్లు లేకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటంతో, వారికి మంచినీరు, చిరుతిళ్లు అందించడానికి అదనపు సిబ్బందిని నియమించారు. పంబ, సన్నిధానం మార్గాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా తగినంత మంచినీరు సరఫరా చేయాలని హైకోర్టు సూచించింది. ఆలయ అధికారులు, పోలీసులు రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, భక్తులు సహకరించి ఆన్‌లైన్ లేదా స్పాట్ బుకింగ్ సమయాలను పాటించాలని కోరారు.