Annaprasadam Distribution in TTD Temples: టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు

అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు

Update: 2025-12-13 05:58 GMT

Annaprasadam Distribution in TTD Temples: టిటిడి ఆలయాలలో భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాద వితరణ చేసేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. టిటిడి ఆధ్వర్యంలోని 60 ఆలయాలలో అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు టిటిడి యంత్రాంగం ఏర్పాట్లను సిద్దం చేస్తోంది.

అన్నప్రసాద వితరణ నేపథ్యం :

తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందించేందుకు ఏప్రిల్ 06, 1985 తేదీన టిటిడి శ్రీకారం చుట్టింది. తొలుత ఎస్వీ నిత్య ప్రసాద స్కీం క్రింద 2 వేల మందికి అన్నప్రసాదరణ కార్యక్రమాన్ని అప్పటి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నందమూరి తారకరామారావు ప్రారంభించారు. ఆ తరువాత 1994, ఏప్రిల్‌ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైంది. ఇటీవల దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా ఏప్రిల్ 01, 2014న నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం జరిగేది. 2011, జులై 7 నుంచి తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈ భవనాన్ని అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్‌ ప్రారంభించారు. నవంబర్ 15 నాటికి రూ. 2,316 కోట్లు ఈ ట్రస్ట్ కు డిపాజిట్ గా జమ అయ్యాయి.

తిరుమలలో….

తిరుమలలోని శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంతో పాటు, రాంబగీచ బస్టాండు, ఏఎంసీ, సిఆర్‌వో, పిఏసి-1 వద్ద ఫుడ్‌ కౌంటర్లు, పీఏసీ – 2, పీఏసీ – 4, పీఏసీ – 5 హాల్స్, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణ గిరి షెడ్స్, బయటి క్యూ లైన్స్ లలో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలో సాధారణ రోజులలో రోజుకు 1.80 లక్షల ముండి 1.90 మంది, వారాంతపు రోజులలో రోజుకు 2 లక్షల నుండి 2.10 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాలలో గరుడసేవ రోజున సరాసరి 2 లక్షల మందికి పైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది.

తిరుపతిలో…

తిరుచానూరులోని అన్నప్రసాద వితరణ కేంద్రం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలోని అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, శ్రీనివాసం, విష్ణునివాసం, శ్రీనివాసం, విష్ణునివాసం, ఆసుపత్రులలో, ఒంటిమిట్టలోని శ్రీ కోందరరామ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. సదరు కేంద్రాలలో సాధారణ రోజులలో 15 వేల నుండి 16 వేలకు మంది, వారాంతపు రోజులలో 18 వేల నుండి 20 వేల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు.

త్వరలో 60 టిటిడి ఆలయాలలో….

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పర్యవేక్షణలో త్వరలో 60 టిటిడి ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదర చేసేందుకు టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. అన్నప్రసాద వితరణకు ఇప్పటికే టిటిడి ఈవో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. అన్నప్రసాదం వితరణ, తయారీకి ధార్మిక సంస్థలు, మఠాలు ముందుకు వచ్చే వారితో అవగాహణ చేసేందుకు టిటిడి చర్యలు చేపట్టింది .

Tags:    

Similar News