Wearing a Two-Faced Rudraksha: ద్విముఖి రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

Update: 2025-10-14 08:57 GMT

Wearing a Two-Faced Rudraksha: చాలా మంద రుద్రాక్షను ధరిస్తారు. అయితే ద్విముఖ రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏకముఖ రుద్రాక్ష సూర్యునికి చిహ్నం కాగా, ద్విముఖ రుద్రాక్ష చంద్రునికి చిహ్నం. దీనివల్ల ధరించిన వారిపై చంద్రుని ప్రభావం ఉంటుందని పండితులు తెలిపారు. ఈ రుద్రాక్ష శివుడు, పార్వతి అంశాలతో కూడి అర్ధనారీశ్వరుని చిహ్నంగా ఉంటుంది. ఇది స్త్రీ-పురుష శక్తుల కలయికను సూచిస్తుంది.

ద్విముఖ రుద్రాక్ష ధరించడం వల్ల డబ్బు వస్తుందనేది కేవలం అపోహ అని పండితులు స్పష్టం చేశారు. దీనివల్ల కలిగే అసలు ప్రయోజనాలు:

మనశ్శాంతి: ఓర్పు, సహనం, మానసిక సంతృప్తి, మనశ్శాంతి కలుగుతాయి.

శారీరక శుద్ధి: శరీరంలోని అగ్ని, గాలి, నీరు అనే అంశాలను మేల్కొలిపి మనస్సును శుద్ధి చేస్తుంది.

కోపం నియంత్రణ: వయస్సు పెరిగే కొద్దీ వచ్చే కోపం, ఆగ్రహం, మానసిక అశాంతి తగ్గుతాయి. ముఖ్యంగా కోపం తగ్గుతుందని చెప్పారు.

రోగ్య సమస్యలకు పరిష్కారం: మూర్ఛ, శరీరం చల్లబడటం, మానసిక సంతృప్తి లేకపోవడం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో నీటి శాతం

తక్కువగా ఉన్నవారికి, తరచుగా గర్భస్రావాలు అయ్యే మహిళలకు, జలుబు, ముక్కు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది చాలా మంచిది.

ఎవరు ధరించాలి?

ఈ రుద్రాక్షను ఎవరైనా ధరించవచ్చు. ప్రత్యేకించి, 50 ఏళ్లు పైబడిన వారు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది చాలా మంచిదని పండితులు సూచించారు.

ద్విముఖ రుద్రాక్ష ధరించేవారు కొన్ని నియమాలు పాటించాలని సలహా ఇచ్చారు:

సమయం: శుక్ల పక్షంలోని సోమవారం సాయంత్రం వేళల్లో, వీలైతే గోదోలి ముహూర్తంలో శివాలయంలో ధరించడం అత్యంత అనుకూలం.

అభిషేకం: ధరించే ముందు రుద్రాక్షను స్వచ్ఛమైన నీరు, పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేయాలి.

పూజ: అభిషేకం తర్వాత దానిని దేవత పక్కన ఉంచి ప్రార్థన చేయాలి.

మంత్రం: ఈ రుద్రాక్షను ధరించిన తర్వాత కనీసం 108 సార్లు "ఓం నమః రుద్రాయ" అనే మంత్రాన్ని జపించాలి.

ద్విముఖ రుద్రాక్ష ధరించడం శాంతి, ప్రశాంతత, ఆరోగ్య పునరుద్ధరణకు దారితీస్తుందని పండితులు వెల్లడించారు.

Tags:    

Similar News