Budhaditya Raj Yoga in Scorpio: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాశి మార్పులు, గ్రహ కలయికలకు అత్యంత విశిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల రాకుమారుడైన బుధుడు, గ్రహాల అధిపతి అయిన సూర్యభగవానుడి కలయిక అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది. 2026 నవంబర్ 4వ తేదీన వృశ్చిక రాశిలో సూర్యుడు, బుధుడు సంయోగం చెందనున్నారు. ఈ కలయిక వల్ల అత్యంత శుభప్రదమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, ప్రధానంగా నాలుగు రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక లాభాలు, కెరీర్‌లో ఊహించని పురోగతి కలగనున్నాయి.

బుధాదిత్య యోగంతో విశేష ప్రయోజనాలు పొందే రాశులు:

మేష రాశి

మేష రాశి జాతకులకు ఈ కాలం అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది.ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉన్నత పదవులను అధిరోహిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారవేత్తలకు నూతన ఒప్పందాలు కుదిరి భారీ లాభాలు చేకూరతాయి. వివిధ మార్గాల ద్వారా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించి శారీరక దృఢత్వం పెరుగుతుంది.

సింహ రాశి

సూర్యుడు అధిపతిగా ఉండే సింహ రాశి వారికి ఈ కలయిక విశేషమైన ఆర్థిక పురోగతిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. పనుల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం వరిస్తుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే కల నెరవేరే అవకాశం ఉంది. పొదుపు గణనీయంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరిగి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

వృశ్చిక రాశి

సొంత రాశిలోనే సూర్య-బుధుల సంయోగం జరగడం వల్ల వృశ్చిక రాశి వారికి ఇది నిజమైన గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఆర్థిక సమస్యలన్నీ సమసిపోతాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు వేగవంతమై కోరికలు నెరవేరుతాయి. భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. నూతన పెట్టుబడులు అనుకూలించి వ్యాపారస్తులు ఊహించని రీతిలో లాభాలు ఆర్జిస్తారు.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రాజయోగం ద్వారా బహుముఖ ప్రయోజనాలు కలగనున్నాయి. విదేశీ వ్యవహారాలు, ఎగుమతి-దిగుమతి వ్యాపారాలు చేసే వారికి అపారమైన లాభాలు వస్తాయి. ప్రయాణాలు ఆర్థికంగా లాభిస్తాయి. కార్యాలయంలో పై అధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న అవివాహితులకు అనుకూలమైన సంబంధం కుదురుతుంది. స్నేహితులు, బంధువుల అండదండలతో అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా చేరుకుంటారు.

Tags: