Can Pregnant Women Visit Temples: గర్భిణీలు ఆలయానికి వెళ్లొచ్చా..? పండితులు ఏమంటున్నారు..?

పండితులు ఏమంటున్నారు..?;

Update: 2025-07-17 05:53 GMT

Can Pregnant Women Visit Temples: గర్భిణీ స్త్రీలు దేవాలయాలను సందర్శించకూడదని కొంత మంది అంటుంటారు. దీనిపై చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయి. గర్భిణీ స్త్రీలపై దేవుని దయ ఎల్లప్పుడూ ఉంటుందని... గర్భిణీ స్త్రీల పట్ల భక్తి, కరుణ, సహాయకారిగా ఉండటం చాలా ముఖ్యమని ఎంతోమంది పండితులు తెలిపారు.

దేవాలయాలు శక్తి కేంద్రాలు. దేవాలయాలలో పూజలు, ప్రత్యేక కిరణాలు గర్భిణీ స్త్రీలపై ప్రభావం చూపుతాయి. పిండం అభివృద్ధి దశలో నుండి నాల్గవ నెల వరకు ఈ శక్తుల ప్రభావం శరీరంపై స్వల్ప ఒత్తిడిని కలిగిస్తుందని పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ కాలంలో దేవాలయాలను సందర్శించకుండా ఉండటం మంచిదని పలువురు పండితులు సలహా ఇస్తున్నారు.

కానీ 5వ నెల నుండి ఏడవ నెల వరకు గర్భిణీ స్త్రీలు ఆలయాన్ని సందర్శించవచ్చు. అయితే ఎనిమిదవ, తొమ్మిదవ నెలల్లో దర్శనం అంత శుభప్రదం కాదు. కానీ, ఒక నిజం ఏమిటంటే, ఆలయం అంటే గర్భిణీ స్త్రీ ఉండే ప్రదేశం. మనస్సే దేవాలయం. ఇంట్లో ప్రార్థన చేయడం, దేవుడి ఫోటో చూడటం, ప్రార్థన చేయడం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. దేవుడు సర్వవ్యాప్తి, సర్వశక్తిమంతుడు అనే నమ్మకాన్ని గురువులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News